Header Banner

నెల్లూరు జిల్లాకు అంతర్జాతీయ ఎయిర్ పోర్టు! ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక ప్రకటన! INDOSEL, BPCL కంపెనీలు..

  Fri Feb 21, 2025 21:18        Politics

ఏపీకి అంతర్జాతీయ సంస్థలు రాబోతున్నాయని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడమే తమ లక్ష్యమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాకు రాబోతున్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దగదర్తి మండలం. దామవరం వద్ద ఎయిర్ పోర్టు భూములను ఇవాళ(శుక్రవారం) ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం పరిశీలించారు. భూములు కోల్పోతున్న రైతులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే కావ్యా క్రిష్ణారెడ్డి భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగువారు కావడంతోనే ఎయిర్ పోర్టు పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. రామ్మోహన్ చొరవతో ఒక్కరోజు వ్యవధిలో అధికారులను ఢిల్లీ నుంచి ఏపీకి పంపారని అన్నారు. INDOSEL, BPCL సహా చాలా కంపెనీలు నెల్లూరు వైపు అడుగులు వేస్తున్నాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే కావ్యా క్రిష్ణారెడ్డి తెలిపారు. కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు అనుసంధానం చేస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం కానుందని అన్నారు. ఎయిర్ పోర్టుకు గతంలో సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తే, వైసీపీ పాలనలో ఒక్క అడుగు ముందుకు కూడా పడలేదని చెప్పారు. 700 ఎకరాల భూసేకరణ పూర్తయిందని.. . మిగిలిన భూసేకరణ కూడా త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కావ్యా క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #nellore #indosel #bpcl #internationalairport